Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంట్లో దొరికిన డ్రగ్స్.. నటుడు అజాజ్‌ఖాన్ భార్య అరెస్ట్

Actor Azaz Khan Wife Arrested For Having Drugs
Advertisement
  • రాజకీయ నాయకుడిగా మారిన బిగ్‌బాస్ ఫేమ్ నటుడు అజాజ్‌ఖాన్
  • ఆయన భార్య ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పలు రకాల డ్రగ్స్.. రూ. 11 లక్షల నగదు పట్టివేత
  • నెల రోజుల క్రితం అజాజ్ స్టాఫ్ మెంబర్ అరెస్ట్
  • విచారణలో పలు విషయాల వెల్లడి
  • రెండ్రోజులపాటు అజాజ్ భార్య గులివాలా ఇంట్లో సోదాలు
  • 2021లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి 26 నెలలు జైలులో ఉన్న అజాజ్‌ఖాన్
Advertisement
రాజకీయ నాయకుడిగా మారిన బిగ్‌బాస్ ఫేమ్ నటుడు అజాజ్‌ఖాన్ భార్య ఫాలన్ గులివాలా (40)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీయురాలైన గులివాలా ఉంటున్న జోగీశ్వరి ప్రాంతంలోని ఇంట్లో బుధవారం సోదాలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఆమెను అరెస్ట్ చేశారు. 

నెల రోజుల క్రితం అజాజ్‌ఖాన్ స్టాఫ్ మెంబర్ సూరజ్‌గౌడ్‌ 100 గ్రాముల మెఫెడ్రోన్‌ను ఆర్డర్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. అంధేరీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న అజీజ్ ఆఫీస్‌లో డ్రగ్స్ డెలివరీ కావాల్సి ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు సూరజ్‌ను అరెస్ట్ చేసి నార్కోటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పార్సిల్ తన పేరున ఉన్నప్పటికీ అజాజ్ మేనల్లుడు ఫర్హాన్ వాటిని ఆర్డర్ చేసినట్టు ఇంటరాగేషన్‌లో సూరజ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో జోగేశ్వరిలోని అజాజ్‌ఖాన్ భార్య ఫాలన్ అజాజ్ గులివాలా పేరున ఉన్న ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు.  

ఫర్హాన్ ‘ఏక్ నంబర్ ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నట్టు ఇంటరాగేషన్‌లో గులివాలా తెలిపింది. కాగా, గులివాలా నివాసంలో నిర్వహించిన సోదాల్లో 136 గ్రాముల చరాస్, 33 గ్రాముల మెఫెడ్రోన్‌ ఖాళీ పౌచ్‌లు, 28 గ్రాముల మెఫెడ్రోన్‌ మాత్రలు, ఇతర మత్తు పదార్థాలు, రూ. 11 లక్షల నగదు లభించాయని, దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. భార్య అరెస్ట్ నేపథ్యంలో ఇప్పుడు అజీజ్‌ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. 

2021లో అజాజ్ 4.5 గ్రాముల బరువున్న 31 అల్ఫ్రాజోలమ్ ట్యాబ్లెట్స్‌తో దొరికిపోయాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన 26 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత వెర్సోవా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన అజాజ్‌కు కేవలం 155 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
Advertisement
Advertisement
Ajaz Khan
Fallon Guliwala
Drugs
Mumbai

More Telugu News